వరంగల్ జిల్లా : ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర ప్రారంభమైంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గురువారం స్వామి వారికి నూతన వస్త్రాలంకరణ, విఘ్నేశ్వర పూజ, పున్యాహవచనం, ధ్వజారోహణం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుపుతున్నారు. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికే ఆలయ అధికారులు దర్శనానికి అనుమతి ఇచ్చారు. దీంతో కొవిడ్ రూల్స్ పాటిస్తూ భక్తులు ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు.
Home United Warangal