శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రులు

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రులుతిరుపతి : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని గురువారం పలువురు ప్రముఖులు శ్రీ వెంకటేశ్వరస్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు.

వీరితో పాటుగా ఎంపీలు కొత్త ప్రభాకర్, రంజిత్ రెడ్డి, వెంకటేశ్ రెడ్డి నేత, కవిత, ఎమ్మెల్యేలు బాలరాజు, సండ్ర వెంకట వీరయ్య, మర్రి జనార్ధన్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, శంకర్ నాయక్ , వివేక్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, కొత్తపల్లి రవీంద్రరావు, షంభీపూర్ రాజు వైకుంఠ ద్వార ప్రవేశం చేసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.