సత్యభామ ఫేమ్ జమున ఇకలేరు

సత్యభామ ఫేమ్ జమున ఇకలేరుసత్యభామ ఫేమ్ జమున ఇకలేరు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీనియర్ నటి జమున (86) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. సత్యభామ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జమున, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 198 సినిమాల్లో నటించారు. 1936, ఆగస్టు 30న హంపీలో జన్మించిన ఆమె తన 14 యేట 1953లో పుట్టిల్లు సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

తెలుగులో రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్యవంటి మహామహులతో పోటీపడి నటించింది జమున. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. 1980లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఎన్నికయ్యారు.