నారాలోకేష్ పాదయాత్రకు అంతా రెడీ

నారాలోకేష్ పాదయాత్రకు అంతా రెడీ

నారాలోకేష్ పాదయాత్రకు అంతా రెడీవరంగల్ టైమ్స్, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో యువగళం పాదయాత్రకు తొలి అడుగు వేయనుంది. కుప్పంలో భారీ బహిరంగ సభతో లోకేష్ జనం మధ్య ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళం విప్పనున్నారు. ఇక లోకేష్ పాదయాత్ర, బహిరంగ సభకు పర్మిషన్ పై గత 10 రోజులుగా పెద్ద రచ్చనే జరిగింది. నారా లోకేష్ యువగళం పాదయాద్రకు అంతా రెడీ అయ్యింది. షరతులు, పోలీస్ పర్మిషన్ తో యాత్ర ప్రారంభం కానుంది. కుప్పంలో యువగళం బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తెలుగు తమ్ముళ్లు కసిగా ఉన్నారు.

అటు కుప్పం పసుపుమయంగా మారింది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, తోరణాలతో సందడి కనిపిస్తోంది. 400 రోజుల పాటు 4వేల కిలో మీటర్లు కొనసాగనున్న ఈ యువగళం పాదయాత్రను ఏపీలో టీడీపీ చేపడుతుంది. చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఇక లోకేష్‌ పాదయాత్ర, బహిరంగ సభకు పర్మిషన్‌పై గత 10 రోజులుగా పెద్దరచ్చనే జరగింది. 2 ప్రొసీడింగ్స్‌లో మొత్తం 29 నిబంధనలు పొందుపరిచిన చిత్తూరుజిల్లా పోలీస్‌ యంత్రాంగం లోకేష్ యువగళంకు అనుమతినిచ్చింది. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో వారంరోజులు పాటు సాగే లోకేష్ పాదయాత్రకు పర్మిషన్ జారీ చేసింది.