గంజాయి క్రయవిక్రయాలకు చెక్ 

గంజాయి క్రయవిక్రయాలకు చెక్

వరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి క్రయవిక్రయాలకు చెక్ పెట్టేందుకు సీపీ ఏవీ రంగనాథ్ ప్రత్యేక కార్యాచరణకు రెడీ అయ్యారు. గంజాయితో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకుండా గంజాయి రహిత వరంగల్ పోలీస్ కమిషనరేట్ గా తయారుచేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలా కార్యాచరణ చేశారు.గంజాయి క్రయవిక్రయాలకు చెక్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా వ్యక్తులు గానీ, సంస్థలు గానీ గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడుతున్నట్లు లేదా సేవిస్తున్నట్లు గుర్తించినట్లైతే తక్షణమే వరంగల్ సీపీ సెల్ నంబర్ 9491089100 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందచేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు సీపీ ఏ.వి. రంగనాథ్ తెలిపారు. ఇకపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులతో పాటు సేవించేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీపీ హెచ్చరించారు.