ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

వరంగల్ టైమ్స్ , సిద్దిపేట జిల్లా : అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషిచేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు సిద్దిపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ కూడలిలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ డా. బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ కలలను నిజం చేస్తున్నారని హరీశ్ రావు తెలిపారు.ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలుజగ్జీవన్ రామ్ 1952 నుండి వరుసగా 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, సుధీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పనిచేసి, ఎన్నో పదవులు సుదీర్ఘకాలం అనుభవించినా చాలా నిరాడంబర జీవితం గడిపారని గుర్తు చేశారు. గాంధీజీ ఎన్నో సందర్భాల్లో జగ్జీవన్ రామ్ ను కొనియాడారని గుర్తు చేశారు. ఆ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలన కొనసాగిస్తున్నారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అలాగే సిద్దిపేట జిల్లా కేంద్రంలో త్వరలోనే బాబు జగ్జీవన్ రామ్ భవనాన్ని నిర్మించుకుందామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.