ఈ నెలలో 1500 ఆశ పోస్టులకు నోటిఫికేషన్  

ఈ నెలలో 1500 ఆశ పోస్టులకు నోటిఫికేషన్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. బస్తీ ఆస్పత్రుల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామన్నారు.ఇప్పటి వరకు బస్తీ ఆస్పత్రుల్లో కోటి మంది ప్రజలు సేవలు పొందారని వెల్లడించారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు. పేదల సౌకర్యం కోసం బస్తీ ఆస్పత్రుల్లో టైమింగ్స్ లో మార్పు చేస్తామన్నారు. ఇకపై శనివారం సెలవు ఇస్తున్నామని, ఆదివారం పనిచేయనున్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు.ఈ నెలలో 1500 ఆశ పోస్టులకు నోటిఫికేషన్  బస్తీ ఆస్పత్రుల్లో ఫ్రీగా థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్ వంటి ఖరీదైన పరీక్షలు చేస్తున్నామని హరీష్ రావు వెల్లడించారు. మార్చి నెలాఖరు వరకు 134 రకాల టెస్టులు నిర్వహిస్తామన్నారు. 158 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ ఆస్పత్రుల్లో ఉస్మానియా, గాంధీ ఆస్పుత్రులపై ఓపీ భారం తగ్గిందని చెప్పారు.

ఏప్రిల్ లో అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తామని మంత్రి అన్నారు. త్వరలోనే మేడ్చల్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని తెలిపారు. క్రమంగా అన్ని జిల్లాల్లో వైద్య కాలేజీలు ఏర్పాటు చేయనున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.