కొత్త గవర్నర్లను ప్రకటించిన కేంద్రం 

కొత్త గవర్నర్లను ప్రకటించిన కేంద్రం

కొత్త గవర్నర్లను ప్రకటించిన కేంద్రం 

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఏపీకి గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జీ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ను నియమించింది. ఇక బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా నియమించారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న ఎస్.అబ్దుల్ నజీర్ జనవరి 4న రిటైర్ అయ్యారు. ఇక అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిలలో ఈయన కూడా ఒకరు. ఇక మహారాష్ట్ర గవర్నర్ భగవంత్ కొశ్యారి, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణన్ మాథూర్ ల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో ఆయా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక ఇతర రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం అయ్యారు.

రాష్ట్రాల వారిగా గవర్నర్ల నియామకం..
నాగాలాండ్ గవర్నర్ గా గణేషన్
మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్ బైస్
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా త్రివిక్రమ్ పట్నాయక్
మణిపూర్ గవర్నర్ గా అనసూయ
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రసాద్ శుక్లా
బీహార్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్
అస్సాం గవర్నర్ గా గులాబీ చంద్ కటారియా
జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్
సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్
లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మిశ్రాను కేంద్రం నియమించింది.

కాగా ఏపీకి గవర్నర్ మార్పుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు ఏడాదిన్నర సమయం ఉండడం, ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో గవర్నర్ మార్పు వెనుక రాజకీయ కోణం ఉందా అనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇతర రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గవర్నర్ల మార్పు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే కొన్నిరోజుల క్రితం తెలంగాణ గవర్నర్ తమిళిసైని బదిలీ చేయనున్నారనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా కేంద్రం ప్రకటించిన గవర్నర్ల జాబితాలో 12 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం ఉండగా, ఇందులో తెలంగాణ గవర్నర్ మార్పు లేదు. దీంతో ఆ ప్రచారం అవాస్తవమని తేలింది.