భారత్ లో కొత్తగా 2503 కరోనా కేసులు

భారత్ లో కొత్తగా 2503 కరోనా కేసులు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 2503 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,93,494కు చేరాయి. ఇందులో 4,24,41,449 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,15, 877 మంది మరణించగా, 36,168 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో 4377 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 27 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించింది. ఇక కరోనా కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు కూడా తగ్గిపోయింది.భారత్ లో కొత్తగా 2503 కరోనా కేసులు

ప్రస్తుతం రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.08 శాతం మాత్రమేనని వెల్లడించింది. రికవరీ రేటు 98.72 శాతమని తెల్పింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 77.90 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని అన్నారు. నిన్న ఒక్కరోజే 5,32, 232 మందికి పరీక్షలు నిర్వహించామని ఆరోగ్యశాఖ తెల్పింది. అదే విధంగా 1,79,91,57,486 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొంది.