పల్లె వెలుగు బస్సులపై టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం

పల్లె వెలుగు బస్సులపై టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. చిల్లర సమస్యను పరిష్కరించేందుకు ఛార్జీలను రౌండప్ చేసింది. ప్రయాణికులు, కండక్టర్ల బాధలను దృష్టిలో ఉంచుకొని, టీఎస్ ఆర్టీసీ నేటి నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పల్లె వెలుగు బస్సులపై టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయంచిల్లర సమస్య కారణంగా హైదరాబాద్ నగరంలో ఛార్జీల రౌండప్ ను టీఎస్ ఆర్టీసీ రెండేండ్ల క్రితమే అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పల్లె వెలుగు బస్సుల్లో రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్ ధర రూ. 10 గా రౌండప్ చేశారు. రూ. 13, రూ.14 ఉన్న టికెట్ ఛార్జీని రూ. 15గా రౌండప్ చేశారు. 80 కిలో మీటర్ల దూరానికి రూ. 67గా ఉన్న ఛార్జీని రూ. 65 గా నిర్ధారించారు. టోల్ ప్లాజాల వద్ద ఆర్డినరీకి రూ.1, హైటెక్ , ఏసీ బస్సులకు రూ. 2 వసూలు చేయనున్నారు.