దళితబంధుపై రాజాసింగ్ ఏమన్నాడో తెలుసా?

దళితబంధుపై రాజాసింగ్ ఏమన్నాడో తెలుసా?

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో ఏర్పాటు చేసిన దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొని ప్రసంగించారు. ధూల్ పేటలో ఒక బర్త్ డే పార్టీకి రూ. 10 లక్షలు ఖర్చు చేస్తారు. పెళ్లికి అయితే రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు చేస్తారని రాజాసింగ్ పేర్కొన్నారు. డబ్బులను వృథా చేయకూడదు. ప్రతీ ఒక్కరూ డబ్బుల విలువ తెలుసుకోవాలి. మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ రాజాసింగ్ దళిత బంధును ఉద్దేశించి లబ్ధిదారులకు సూచనలు ఇచ్చారు.దళితబంధుపై రాజాసింగ్ ఏమన్నాడో తెలుసా?తెలంగాణ ప్రభుత్వం దళిత కుటుంబాల కోసం దళిత బంధు అనే మంచి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా దళితులందరూ లబ్ధి పొందాలి. మంచి వ్యాపారం చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో మేం ఇలా బాగుపడుతున్నామని, పది మందికి మీరు చెప్పాలి. ఈ పథకం వల్ల మాకు ఇంత లాభం జరిగింది. మీరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారుల సూచించాలని రాజాసింగ్ తెలిపారు. ఏ నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు, సంబంధిత నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకుంటే ఇతరులకు ఇబ్బంది కలుగకుండా ఉంటుందని ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు.