ఈనె 28, 29న దేశవ్యాప్త సమ్మె

ఈనె 28, 29న దేశవ్యాప్త సమ్మె

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు కేంద్ర కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ సమ్మెలో రవాణా, విద్యుత్తు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇలా అన్ని రంగాల కార్మికులు పాల్గొంటారని వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం ఈఫీఎఫ్ వడ్డీ రేటును 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గించిందని, ఇంధన ధరలను ఎడాపెడా పెంచుతుందని కార్మిక సంఘాలు విమర్శించాయి.ఈనె 28, 29న దేశవ్యాప్త సమ్మెదీని ప్రభావం సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులపై అధికంగా పడుతున్నదని పేర్కొన్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు విద్యుత్తు రంగ ఉద్యోగులు ప్రకటించారు. బుధవారం జరిగిన విద్యుత్తు ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.