ఇవి తిన్నారంటే బరువు తగ్గడం ఖాయం! 

ఇవి తిన్నారంటే బరువు తగ్గడం ఖాయం!

ఇవి తిన్నారంటే బరువు తగ్గడం ఖాయం! 

వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : నేటికాలంలో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఊబకాయం వస్తుంది. అంతేకాదు చాలా మంది జంక్ ఫుడ్ కు అలవాటు పడి ఇంటి ఫుడ్ కు దూరం అవుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఊబకాయంతో బాధపడుతున్నారు. అన్నంతో పాటు రాజ్మా ఆహారంలో చేర్చుకున్నట్లయితే వారం రోజుల్లో మీ పొట్ట చుట్టున్న కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

*రాజ్మా ఎలా ఉంటుంది..
రాజ్మా.. చాలా మంది ఎంతో ఇష్టంగా తినే ఆహారం. దీనిని ‘కిడ్నీ బీన్స్’ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది సరిగ్గా కిడ్నీ ఆకారాన్ని కల్గి ఉంటుంది. ఇవి నలుపు, ముదురు ఎరుపు, లేత ఎరుపు రంగులలో లభిస్తాయి.

*పొట్ట తగ్గడంలో రాజ్మా పాత్ర..
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్, సోడియం, కాపర్, ఫోలేట్, కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం మొదలైనవి ఉంటాయి. ప్రోటీన్స్ , ఖనిజాలు అధికంగా ఉండే ఆహార పదార్థాల్లో రాజ్మా ఒకటి. అంతేకాకుండా ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో ఇది బరువు తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది. అంతేకాదు రాజ్మాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

రాజ్మాను క్రమం తప్పకుండా తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.అలాగే మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు శుభ్రంగా ఉంటుంది. వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అంతే కాదు ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి కిడ్నీ బీన్స్ చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇది కడుపు నిండుగా ఉంచుతుంది.

రాజ్మాను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

1. రాజ్మా సలాడ్ :
బరువు తగ్గాలనుకునేవారు రాజ్మా సలాడ్ ప్రయత్నించి చూడండి. కూరగాయలతో ఉడకబెట్టి అందులో చిటికెడ్ ఉప్పు కలుపుకుని తినాలి. ముఖ్యంగా మసాలాలు, నూనె అస్సలు వేయకూడదు.

2. రాజ్మా సూప్ :
బరువు తగ్గాలనుకుంటే రాజ్మా సూప్ చాలా మేలు చేస్తుంది. రాజ్మాను ఉడకబెట్టిన తర్వాత కొన్నికూరగాయలను అందులో కలపాలి. రుచి కోసం కొంచెం చాట్ మసాలా, ఉప్పు వేయాలి.

3. రాజ్మా రైతా:
రాజ్మా రైతా తయారు చేయాలంటే ముందుగా రాజ్మాను ఉడికించి మెత్తగా గ్రాండ్ చేసుకోవాలి. అందులో కొంచెం పెరుగు కలపాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేయాలి.అంతే రాజ్మా రైతా తయారు.

ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
* బలమైన ఎముకలకోసం, క్యాన్సర్ నివారణకు రాజ్మా ఉపయోగాలు..
రాజ్మా ఎముకల నొప్పిని తగ్గిస్తుంది. వారానికి రెండు మూడుసార్లు రాజ్మా తినడం వలన ఎముకల నొప్పి తగ్గుతుంది. అలాగే కాల్షియం ఉండటం వలన ఎముకలను బలంగా చేస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిని రోజూ తినడం వలన శరీరం బయోయాక్టివ్ సమ్మేళనాలను అందిస్తుంది. దీంతో క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.

* ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది..
అంతేకాకుండా రాజ్మా శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని అందిచడమే కాకుండా , ప్రోటీన్ కణాలను నిర్మిస్తుంది. రోగ నిరోధక శక్తి మాత్రమే కాకుండా, శరీరానికి బలాన్ని, శక్తిని అందించడానికి రోగ్యులర్ గా రాజ్మా తీసుకోవాలి. రాజ్మాలో యాంటీ ఆక్సిడెంట్స్ , ఫోలిక్ యాసిడ్, జింక్ , ఐరన్ పుష్కలంగా ఉండటం వలన మీరు బరువు తగ్గి, బలంగా ఉంటారు.