కామారెడ్డిలో ప్రధాన పార్టీలకు టెన్షన్ ! 

కామారెడ్డిలో ప్రధాన పార్టీలకు టెన్షన్ ! 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ రైతు ఆత్మహత్యతో మాస్టర్ ప్లాన్ మంటలు ఎగిసిపడ్డాయి. చివరకు మాస్టర్ ప్లాన్ వెనక్కు తీసుకోవడంతో కామారెడ్డిలో గులాబీశ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. నెపమంతా కలెక్టర్ పై నెట్టి మమ అనిపించేశారు. కానీ జనంలో మాత్రం ఇంకా గులాబీ పార్టీపై ఆగ్రహావేశాలు చల్లారలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఎక్కడకు దారి తీస్తోందనన్న గుబులు బీఆర్ఎస్ ను వెంటాడుతోంది.

* అభ్యర్థులను కదలనివ్వని మాస్టర్ ప్లాన్ ఎఫెక్ట్ ..
అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. గులాబీ అభ్యర్థిగా గంప గోవర్ధన్ పోటీ చేసే అవకాశముంది. మాస్టర్ ప్లాన్ చిచ్చు నేపథ్యంలో పార్టీలోని ఇతర నాయకులెవ్వరూ ఈ టికెట్ కోసం పట్టుబట్టడం లేదు. దీంతో గంప గోవర్ధన్ టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు. అయినప్పటికీ జనంలో మాత్రం ఆయన కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్తున్నారు. ప్రగతి నివేదన యాత్రలతో ప్రజలతో టచ్ లో ఉంటున్నారు. కానీ కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం ఆ పరిస్థితే లేదు. గంప గోవర్ధన్ లాగే ఇతర బీఆర్ఎస్ లీడర్లు కూడా ఇక్కడ పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కామారెడ్డిలో ప్రధాన పార్టీలకు టెన్షన్ ! 

* అంచనాలన్నీ తారుమారు..
కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ లొల్లికి ముందు వరకు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరన్న ప్రచారం జరుగుతోంది. ఈ గొడవకు ముందు వరకు గంప గోవర్ధన్ మంచి దూకుడు మీద ఉన్నారు. కానీ మాస్టర్ ప్లాన్ రగడతో అంతా తలకిందులైంది. అప్పటిదాకా ఫస్ట్ పొజిషన్ లో ఉన్న గులాబీ పార్టీ డౌన్ అయ్యింది. కాంగ్రెస్, బీజేపీకి ఇక్కడ అస్సలు స్కోపే లేదన్న అంచనాలన్నీ తారుమారయ్యాయి. సడెన్ గా కాంగ్రెస్ ఫస్ట్ పొజిషన్ లోకి వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే కొన్నిరోజుల వరకు సైలెంట్ గా ఉండాలని గంప గోవర్దన్ నిర్ణయించుకున్నారు. పరిస్థితులన్నీ చక్కబడ్డ తర్వాతే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కామారెడ్డిలో ప్రధాన పార్టీలకు టెన్షన్ ! *గంప సైలెంట్ తో జోరు పెంచిన షబ్బీర్..
గంప గోవర్ధన్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లడంతో కామారెడ్డిలో కాంగ్రెస్ తరపున షబ్బీర్ అలీ జోరు పెంచారు. పాత పరిచయాలకు ప్రాధాన్యమిస్తూ సైలెంట్ గానే ఆట మొదలుపెట్టేశారు. బీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనంటూ సంకేతాలిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే కామారెడ్డిలో అభివృద్ధి వేగం పుంజుకుంటుందని చెబుతున్నారు. అయితే మంత్రిగా ఉన్నా కామారెడ్డిలో షబ్బీర్ అలీ చేసిన అభివృద్ధి మాత్రం కానరాలేదు. అదే ఆయనకు మైనస్. మరి పాత వ్యతిరేకత నుంచి ఆయన గట్టెక్కుతారా? లేదా? అన్నది చెప్పడం కష్టమే.

* ఆ రెండింటినీ ఢీ కొట్టే దిశగా కమలం కసరత్తు..
బీజేపీ నుంచి రెండు, మూడు పేర్లు ప్రచారంలో ఉన్నా సడెన్ గా అగ్రనేతలు ఎవరైనా కామారెడ్డిలో పోటీచేసే అవకాశముందని టాక్. యెండల లక్ష్మీనారాయణ, అర్వింద్ స్థాయి నాయకులను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కామారెడ్డిలో ఎలాగూ క్యాడర్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే సరైన లీడర్ కావాలన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లో ఉంది. అందుకే పార్టీ పెద్దలు ఆ స్థాయి నేత కోసం ఎదురుచూస్తున్నారు.

*ఏ పార్టీకి గెలుపు ధీమా లేదు !
కామారెడ్డిలో ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎవరి కష్టాలు వారికున్నాయి. దీంతో గెలుపుపై ధీమాగా ఏ పార్టీ కూడా లేదు. మరి ప్రజల చూపు ఎవరి వైపు ఉందో అంతుబట్టడం లేదు. మాస్టర్ ప్లాన్ లొల్లి తర్వాత నాయకులంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏ పార్టీకి జనం అండగా నిలుస్తారన్నది చెప్పడం చాలా కష్టంగా మారింది. అందుకే కామారెడ్డిలో ఏ పార్టీలోనూ జోష్ కనిపించడం లేదు. మరి ఎన్నికలు దగ్గరపడిన కొద్దీ ఈ వాతావరణం మారుతుందా? లేదా ఇలాగే ఉంటుందా? అన్నది చూడాలి.