బంగాళదుంపతో పిగ్మెంటేషన్‌కు చెక్ !
వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : ఈ మధ్యకాలంలో చాలామంది ముఖంపై నల్లమచ్చలు ఏర్పడుతున్నాయి. అందంగా ఉన్న ముఖాలపై నల్లటి మచ్చలు చూడటానికి అందవికారంగా కనిపించేలా చేస్తున్నాయి. అయితే దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. మార్కెట్లో దొరికే ఖరిదైన ఉత్పత్తులు ఎన్ని వాడినప్పటికీ పిగ్మెంటేషన్ మాత్రం తగ్గడం లేదని చాలామంది అంటుంటారు. అయితే కాస్త ఓపిక ఉంటే చాలు. ఇంట్లో లభించే వస్తువులతో పిగ్మెంటేషన్ కు చెక్ పెట్టొచ్చు. కావాల్సిందల్లా బంగాళదుంపలు. బంగాళదుంప చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అయితే దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
* డార్క్ సర్కిల్ :
కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలను పోగొట్టడంలో బంగాళదుంపలు మేలు చేస్తాయి. ఒక బంగాళాదుంపను తీసుకుని రెండు ముక్కలుగా చేసి దానికి కొంత అలోవెరా జెల్ రాయండి. కంటిపై ఒక స్లైస్ ఉంచండి. 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ పద్ధతి ద్వారా మీరు కళ్ల చుట్టూ వాపును తగ్గించవచ్చు.ఇది కళ్ల చుట్టూ ఉన్న నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్‌ను కూడా తగ్గిస్తుంది.
*సన్ ట్యాన్ నుంచి ఉపశమనం :
సన్‌టాన్ నుండి బయటపడాలంటే బంగాళాదుంప రసం తీసుకుని అందులో కాస్త పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే సన్‌టాన్ వల్ల ఏర్పడే నల్ల మచ్చలు పోతాయి. దీన్ని వారానికి రెండు సార్లు చర్మానికి రాసుకోవచ్చు.
*ఎక్స్‌ఫోలియేట్ :
బంగాళదుంపలు కొద్దిగా ఆమ్లంగా ఉండటం వల్ల చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారికి సరైన పరిష్కారం. మీరు చేయాల్సిందల్లా సగం తురిమిన బంగాళాదుంపను ఓట్ మీల్, పాలలో వేసి ఈ మిశ్రమంతో మీ ముఖాన్ని సుమారు పది నిమిషాల పాటు రుద్దండి. వోట్మీల్, పాలు రెండూ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
*ముఖం ముడుతలను తొలగిస్తుంది :
ముఖంపై మచ్చలు, ముడతలు వంటి సమస్యలు ఉన్నవారు బంగాళదుంప రసం, పాలు వాడితే ముఖంపై మచ్చలు, ముడతలు పోతాయి. దీని కోసం, రెండు చెంచాల బంగాళాదుంప రసంలో అర చెంచా గ్లిజరిన్, ఒక చెంచా పాలు కలిపి దీన్ని ముఖానికి రాసుకోవడం వల్ల ముడతలు తగ్గి చర్మం బిగుతుగా మారుతుంది.