బీఆర్ఎస్ తోనే అందరికీ సమన్యాయం : చల్లా
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ, సమన్యాయం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన పలువురు యువనాయకులు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్ర అభివృద్ధికి, మరో వైపు ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేసే సీఎం ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే చల్లా వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయం, విద్యా, ఆరోగ్యం, విద్యుత్ రంగాలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయని వెల్లడించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే కాకుండా దేశం అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఆలోచన చేయడం అభినందనీయమని అన్నారు.
పార్టీలో చేరిన వారిలో కేతపాక నాగరాజు, విష్ణు, శ్రవణ్, కూతురి రాకేష్, బైరపాక రాజు, కోడెపాక రాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి, ఉపాధ్యక్షులు కోడెపాక కుమారస్వామి, రైతు కమిటీ ప్రధాన కార్యదర్శి పాడి చంద్రారెడ్డి, నాయకులు తాళ్లపల్లి రవీందర్, వర్ణం శ్రీధర్ రెడ్డి తదిరలులు పాల్గొన్నారు.