ప్రత్యక్ష తరగతులకు..ఉత్తర్వులు జారీ

ప్రత్యక్ష తరగతులకు..ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రెసిడెన్షియల్ , సాంఘీక సంక్షేమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు మినహా మిగతా పాఠశాలలను కొవిడ్ నిబంధనల మేరకు తెరిచేందుకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆన్లైన్, ఆఫ్ లైన్ తరగతులకు అనుమతి ఇచ్చింది. ప్రత్యక్ష బోధనపై విద్యార్థులను పాఠశాలలు బలవంతపెట్టొద్దని ప్రభుత్వం ఆదేశించింది.ప్రత్యక్ష తరగతులకు..ఉత్తర్వులు జారీఆన్లైన్ , ప్రత్యక్ష బోధన అంశంపై పాఠశాలలదే నిర్ణయమని వెల్లడించింది. స్కూల్స్ అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కు ఆదేశాలిచ్చింది. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎస్ఓపీలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.