ఈ టెంపుల్స్ దర్శిస్తే నాగదోషం నుంచి విముక్తి ! 

ఈ టెంపుల్స్ దర్శిస్తే నాగదోషం నుంచి విముక్తి !

ఈ టెంపుల్స్ దర్శిస్తే నాగదోషం నుంచి విముక్తి ! 

వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : భారతదేశంలో ఎన్నో ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక భూమిలో ఎన్నో సర్పాలకు సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రపంచ ప్రఖ్యాతిని కూడా పొందాలి. పురాణాల్లో పాములకు చాలా ప్రాముఖ్యత ఉంది. పాములను దేవుళ్లుగా కొలుస్తారు, పూజిస్తారు. నాగదేవత అంటూ పిలుస్తారు. హిందూమతంలో పాములను చంపడం పాపంగా భావిస్తారు. అయితే నాగదోషంతో బాధపడేవారు భారత దేశం ఈ దేవాలయాలను సందర్శిస్తే ఆ దోషం నుంచి విముక్తి లభిస్తుంది.

*మన్నార్సాల దేవాలయం (కేరళ) :
ఇది కేరళలోని మన్నార్సాలలో ఉన్న భారతదేశంలోని అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ నాగ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం సర్పరాజు అయిన నాగరాజకు అంకితం చేయబడింది. ఆలయ ప్రాంగణంలో దాదాపు 30,000 రాతి సర్ప విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం 3,000 సంవత్సరాల పురాతనమైనదిగా చెబుతారు. నవ వధూవరులు, పిల్లలు లేని జంటలు సంతానోత్పత్తి కోసం ఈ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

*భుజంగ నాగ దేవాలయం (గుజరాత్) :
భుజి కోట గుజరాత్‌లోని భుజ్ శివార్లలో ఉంది. ఈ కోట యుద్ధంలో మరణించిన చివరి నాగ వంశం అయిన భుజంగకు అంకితం చేయబడింది. స్థానికులు భుజి కొండలపై ఆయన జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించారు. దీనిని భుజంగ నాగ దేవాలయం అంటారు. ప్రతీ సంవత్సరం నాగ పంచమి నాడు ఆలయం చుట్టూ జాతర జరుగుతుంది. ప్రస్తుతం ఈ కోట భారత సైన్యం ఆధీనంలో ఉంది.

*కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం ( కర్ణాటక) :
కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రధాన దేవతలు సుబ్రహ్మణ్య, వాసుకి, శేష, సర్ప దేవతలు. ఈ దేవాలయం అందమైన కుమార పర్వత శిఖరాన్ని నేపథ్యంగా కలిగి ఉంది. దాని చుట్టూ కుమారధార నది ఉంది. వాసుకి, ఇతర పాములు సుబ్రహ్మణ్య గుహలలో ఆశ్రయం పొందాయని నమ్ముతారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే సర్పదోషం తొలగిపోతుందని నమ్ముతుంటారు.