తృటిలో తప్పిన బస్సు ప్రమాదం

తృటిలో తప్పిన బస్సు ప్రమాదం

వరంగల్ టైమ్స్ , కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో తృటిలో బస్సు ప్రమాదం తప్పింది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఫ్లైఓవర్ మీదుగా ప్రయాణిస్తున్న క్రమంలో అదుపుతప్పి, రోడ్డు ప్రక్కన ఉన్న ఫుట్ పాత్ పై బ్రిడ్జిని ఢీకొట్టింది. బిడ్జి సైడ్ ఉన్న పిల్లర్లు విరిగి క్రింద రోడ్డు పై పడటంతో బిడ్జి క్రింద ఉన్న కొంత మందికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఆ తర్వాత డ్రైవర్ బ్రేకులు వేయడంతో బస్సు గాలిలో వేలాడుతూ ఆగిపోయింది.

తృటిలో తప్పిన బస్సు ప్రమాదంప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా గాయపడ్డ ఇద్దరు యువకులను సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.