సీఎం జ‌గ‌న్‌ను కలిసిన ఆర్పీ సిసోడియా

సీఎం జ‌గ‌న్‌ను కలిసిన ఆర్పీ సిసోడియావిజ‌య‌వాడ‌ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు. సిసోడియా ఇటీవల గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న నేపధ్యంలో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంని మర్యాద పూర్వకంగా కలిసి కొద్దిసేపు మాట్లాడారు. క‌రోనా నేపథ్యంలో రాజ్ భవన్‌ను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఈ సందర్భంగా సిసోడియాకు సీఎం జగన్ కు సూచించారు. గవర్నర్ ఆరోగ్య పరిరక్షణ విషయంలో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.