ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి పాజిటివ్‌

జనగాం: ఉమ్మడివరంగల్ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పేద, ధనిక , పేరు, పలుకుబడి తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరిపై దాడి చేస్తుంది. లాక్ డౌన్ సడలింపుతో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసుల వల్ల ఉమ్మడివరంగల్ జిల్లా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా జనగామఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి పాజిటివ్‌నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కోవిడ్ 19 నిర్ధారణ అయిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ముత్తిరెడ్డి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని టీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ గుజ్జ సంపత్ రెడ్డి తెలిపారు.