తొలి రోజు ఆటలో..సత్తా చాటిన భారత బౌలర్లు

తొలి రోజు ఆటలో..సత్తా చాటిన భారత బౌలర్లు

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : భారత్ -శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 252 పరుగులకు ఆలౌటైంది. శ్రేయాస్ అయ్యర్ ( 92 ) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రిషబ్ పంత్ 39, హనుమ విహారీ 31 రన్స్ చేశారు. శ్రీలంక బౌలర్లలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు లసిత్ ఎంబుల్దేనియా, ప్రవీణ్ జయవిక్రమ చెరో 3 వికెట్లు తీశారు.

తొలి రోజు ఆటలో..సత్తా చాటిన భారత బౌలర్లు

ఇక శ్రీలంక ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు మాత్రమే చేసింది. లసిత్ ఎంబుల్దేనియా 0 , నిరోషన్ డిక్వెల్లా 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టారు. అదే సమయంలో అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. శ్రీలంక టీం ఇంకా 166 పరుగుల వెనుకంజలోనే నిలిచింది.