మాస్కుల ధర పై స్పంధించిన నన్నపనేని
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ : మహిళా సంఘాల ప్రతినిధులు బుధవారం వరంగల్ తూర్పు టీఆర్ఎస్. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను కలిసారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కు మాస్కులను తయారు చేసేందుకు సరైన ధర చెల్లించాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నరేందర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, జీడబ్ల్యూఎంసీ కమీషనర్ పమేల సత్పతి తో చర్చించి ఒక్కో మాస్కుకు 3.75 రూపాయలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో మహిళా సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.