మూడో టీ20 : భారత్ టార్గెట్ 147

మూడో టీ20 : భారత్ టార్గెట్ 147

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ధర్మశాల వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. భారత్ కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక జట్లును కెప్టెన్ శనక ఆదుకున్నాడు. 38 బంతుల్లో 74 పరుగులు చేసి క్రీజ్ లో అజేయంగా నిలిచాడు. దినేష్ 22, చమికా కరుణారత్నే 12 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్, హర్షల్ పటేల్ ఒకటి, రవి బిష్ణోయ్ ఒక వికెట్ తీశారు.మూడో టీ20 : భారత్ టార్గెట్ 147