నేడే ముగ్గురు ఎమ్మెల్సీల‌ ప్రమాణస్వీకారం

నేడే ముగ్గురు ఎమ్మెల్సీల‌ ప్రమాణస్వీకారంహైదరాబాద్‌: కొత్త‌గా ఎన్నికైన‌ ముగ్గురు ఎమ్మెల్సీలు ఇవాళ‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్‌లను గవర్నర్‌ కోటాలో ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేసింది. వీరి నియామ‌కానికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్‌రాజ‌న్ ఇప్ప‌టికే ఆమోదం తెలిపారు. దీంతో వారు ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తొలి క‌విగా గోర‌టి వెంక‌న్న గుర్తింపు పొందారు.