గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 10 మంది మృతి

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 10 మంది మృతిఅహ్మదాబాద్‌ : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటెయినర్, టెంపో ఢీకొన్న సంఘటనలో 10 మంది మృత్యువాత పడగా.. 17 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున వడోదర సమీపంలో చోటు చేసుకుంది. టెంపో సూరత్‌ నుంచి పావగఢకు వెళ్తుండగా వడోదర శివారులో వాఘోడియా క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. వేకువ జామున ఘటన జరగడంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.