’ ఉపేంద్ర ‘కబ్జ’ చిత్రం మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

’ ఉపేంద్ర ‘కబ్జ’ చిత్రం మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌హైదరాబాద్: ప్ర‌ముఖ నిర్మాత లాంకో శ్రీధ‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ సిద్దేశ్వరా ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర హీరోగా తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా మూవీ క‌బ్జ‌. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ఆర్. చంద్రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు, గ‌తంలో ఆర్. చంద్రు తెలుగులో సుధీర్ బాబు హీరోగా తెర‌కెక్కి, సూప‌ర్ హిట్ సాధించిన కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రిని అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి పరిచ‌యం అయ్యారు. క‌బ్జ మూవీ నుంచి ఇటీవ‌లే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కి అనూహ్య స్పంద‌న ల‌భించింది, ఈ నేప‌థ్యంలో క‌బ్జ చిత్ర బృందం మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. ఉపేంద్ర అభిమానుల అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్లుగానే క‌బ్జ మోష‌న్ పోస్ట‌ర్ ని సిద్ధం చేశామ‌ని ద‌ర్శ‌కుడు ఆర్.చంద్రు తెలిపారు. ఉపేంద్ర నుంచి ఆడియెన్స్ ఆశించే విల‌క్ష‌ణ‌త, వైవిధ్యం క‌బ్జ సినిమా ఆద్యంతం ఉండేలా రూపొందిస్తున్న‌ట్లుగా నిర్మాత‌లు ఆర్. చంద్ర శేఖర్, మునింద్ర కె. పురా చెప్పారు. ఫుల్ క‌మ‌ర్షీయ‌ల్ ఎంట‌న్ టైనర్ గా క‌బ్జ ఆడియెన్స్ ముందుక రాబోతుంది. క‌న్న‌డ‌తో పాటు తమిళ్, తెలుగు, మలయాళం, ఒరియా మరియు మరాఠీ భాషల్లో క‌బ్బ విడుదుల అవ్వ‌బోతుంది.

ఆర్ట్ : శివ్ కుమార్

ఎడిటర్ : మహేష్ రెడ్డి

సినిమాటోగ్రఫీ : ఎ.జె.షెట్టి

మ్యూజిక్ : రవి. బస్రూర్

సమర్పణ : లాంకో శ్రీధర్

నిర్మాణం : శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్

నిర్మాతలు : ఆర్. చంద్ర శేఖర్, మునింద్ర కె. పురా

రచన – దర్శకత్వం : ఆర్. చంద్రు