కేసీఆర్‌పై రాములమ్మ ఫైర్

మేయర్ పదవి ‘మేసేవారికి’ కాక ‘మేయరు…’ అనే వారికి దక్కాలి: విజయశాంతి

కేసీఆర్‌పై రాములమ్మ ఫైర్హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్పందించిన ఆమె కేసీఆర్‌పై ఫేస్‌బుక్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని మేసేవారికి కాకుండా మేయరు అనే వారికి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘‘దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామని వాస్తవానికి దూరమైన ప్రకటనలు చేస్తూ.. ముఖ్యమంత్రి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అల్లావుద్దీన్ అద్భుతదీపం మాదిరిగా, అసదుద్దీన్ అద్భుతదీపంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయని సీఎం దొర ఆశలు పెంచుకున్నారని అర్థమవుతోందని ఎద్దెవా చేశారు.