సుందర్ రాజుకి విషెష్ చెప్పిన కార్పొరేటర్ రాజు

సుందర్ రాజుకి విషెష్ చెప్పిన కార్పొరేటర్ రాజు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కూడా చైర్మన్ గా నియమితులైన మాస్టర్ జీ విద్యాసంస్థల అధిపతి శ్రీ సంఘంరెడ్డి సుందర్ రాజు యాదవ్ ను 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు మర్యాదపూర్వకంగా కలిసారు.సుందర్ రాజుకి విషెష్ చెప్పిన కార్పొరేటర్ రాజు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోనిఎస్బీహెచ్ కాలనీలోని సుందర్ రాజు యాదవ్ నివాసానికి కార్పొరేటర్ మామిండ్ల రాజు వెళ్లారు. కూడా చైర్మన్ గా నియమితులైన సుందర్ రాజు యాదవ్ కి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. సుందర్ రాజును కలిసిన వారిలో కార్పొరేటర్ రాజుతో పాటు ఎన్. బాబురావు, పి.రాజు, ఎ.కిరణ్, ఈ.సతీష్, పి.మధు, ఎం.రమేష్, కె. క్రాంతి, జీ.రాకేష్, అభిమానులు, స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.