వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం

వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో భాగంగా భారత్ – వెస్టిండీస్ జట్ల మధ్య మరో పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మిథాలీ టీం వరల్డ్ కప్ పోటీల్లో భారత్ రెండో మ్యాచ్ గెలిచినట్లైంది.వెస్టిండీస్ పై భారత్ ఘన విజయంభారత మహిళల ఓపెనర్ స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీలతో చెలరేగిపోయారు. వెస్టిండీస్ మహిళా బౌలర్లను వీరు చీల్చి చెండాడడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ మహిళల టీం చతికిలపడింది. 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత ఉమెన్స్ టీం.. 155 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.