రేపు కూడా మైదానంలో శాస్త్రీయ నృత్య ప్రదర్శన

రేపు కూడా మైదానంలో శాస్త్రీయ నృత్య ప్రదర్శన

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత, భారతీయ సుప్రసిద్ధ నాట్యగత్తె డా. మల్లిక సారాభాయ్ ద్వారా కూడా మైదానంలో నిర్వహిస్తున్న శాస్త్రీయ నృత్య ప్రదర్శనను విజయవంతం చేయాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ బాధ్యులైన పాపారావు తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని నగర ప్రజలకు చీఫ్ విప్ దాస్యం విజ్ఞప్తి చేశారు. కాకతీయులు నడియాడిన నేల ఘన చరిత్రను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కాకతీయ వారసులుగా మనందరిపై ఉందని ఆయన అన్నారు.రేపు కూడా మైదానంలో శాస్త్రీయ నృత్య ప్రదర్శనప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్-మృణాళిని సారభాయ్ ల కూతురైనటువంటి డా.మల్లిక సారభాయ్ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించిందని ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ బాధ్యులైన పాపారావు అన్నారు. ఇలాంలి మరో గొప్ప కార్యక్రమానికి ఓరుగల్లు వేదికవ్వడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రజలందరూ రేపు సాయంత్రం 6 గంటలకు (హాయగ్రీవచారి) కూడా మైదానంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, ఆదర్శ లా కళాశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్, కల్పలత సూపర్ బజార్ చైర్మన్ జనార్దన్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.