ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి : చల్లా

ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి : చల్లా

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దామెర మండలం దుర్గంపేట, సీతారాంపురం, పసరగొండ, పులుకుర్తి ల్యాదేళ్ళ గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ఇంకా పురోగతిలో ఉన్న అభివృధ్ది పనులపై కార్యకర్తలను ఎమ్మెల్యే ఆరా తీశారు.ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి : చల్లాగ్రామాల్లో పెండింగ్ లో ఉన్న పనులపై సంబంధిత అధికారులకు ఫోన్ లో మాట్లాడి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. దేశంలోని ఏ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఉచితంగా కరెంటు సరఫరా ప్రభుత్వం చేయడం లేదని, సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

గ్రామాల్లో బీజేపీ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో ఉన్న బీజేపీ నాయకులను వారు అధికారంలో ఉన్న రాష్ట్రలలో ఏ పథకాలు అమలు చేస్తున్నారో ప్రశ్నించాలన్నారు. గ్రామాల్లో ఉన్న నాయకులు సమిష్టిగా ఉండి గ్రామ అభివృద్ధిలో తోడ్పాటు అందించాలన్నారు.

ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన భాధ్యత కార్యకర్తలదే అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. విభేదాలకు తావివ్వకుండా అందరూ కలిసికట్టుగా పార్టీ పటిష్టతకు కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.