విద్యాలయాల రీఓపెన్ పై మంత్రి సబితా క్లారిటీ

విద్యాలయాల రీఓపెన్ పై మంత్రి సబితా క్లారిటీహైదరాబాద్ : కరోనా ప్రభావంతో తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. సంక్రాంతి సెలవుల అనంతరం నుంచి ఈ నెల 30 వరకు స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎప్పుడు మళ్లీ పున: ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువవుతుంది. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లు పున:ప్రారంభం అవుతాయనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు.విద్యాలయాల పున:ప్రారంభంపై వస్తున్న రకరకాల ఊహాగానాలపై మంత్రి క్లారిటీ ఇచ్చింది. స్కూళ్లు, కాలేజీల రీఓపెన్ పై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చింది. విద్యాసంస్థలను తెరవాలా, వద్దా అనేది ఈ నెల 30 నాటికి ఉన్న కరోనా పరిస్థితులను బట్టి ఉంటుందని ఆమె వెల్లడించారు.