గాన కోకిల లతా మంగేష్కర్ ఇకలేరు

గాన కోకిల లతా మంగేష్కర్ ఇకలేరువరంగల్ టైమ్స్, ముంబై : భార‌త సినీ అభిమానులకు ఈరోజు చీక‌టి దినం. భార‌త సంగీత చ‌రిత్ర‌లో త‌న‌కంటూ కొన్ని పేజీల‌ను లిఖించుకొన్న గాన కోకిల ల‌తా మంగేష్క‌ర్ ఈలోకం వీడి వెళ్లిపోయారు. దీంతో యావ‌త్ దేశం అంతా త‌న‌కు నివాళులు అర్పిస్తోంది. ల‌తా మంగేష్క‌ర్ అంతిమ యాత్ర‌లో త‌న అభిమానులు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు.

త‌న నివాసం ప్ర‌భుకుంజ్ నుంచి శివాజీ పార్క్ వ‌ర‌కు నిర్వ‌హించిన అంతిమ యాత్ర‌లో ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా పాల్గొన్నారు. ప్ర‌స్తుతం త‌న పార్థీవ‌దేహాన్ని శివాజీ పార్క్‌కు తీసుకొచ్చారు. కాసేప‌ట్లో త‌న అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ల‌తా మంగేష్క‌ర్ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన‌నున్నారు. త‌న‌కు నివాళుల‌ర్పించ‌నున్నారు. ల‌తా మంగేష్క‌ర్‌ను కడ‌సారి చూడ‌టానికి శివాజీ పార్క్‌కు భారీగా అభిమానులు త‌ర‌లివ‌చ్చారు.