ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ బౌలర్ల విజృంభన

ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ బౌలర్ల విజృంభనదుబాయ్ : టీ20 ప్రపంచకప్ గ్రూప్-1లో టేబుల్ టాపర్లుగా ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య శనివారం మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు.

గత మ్యాచ్ లో అర్థశతకంతో అలరించిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1) ఎదుర్కొన్న రెండో బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సమయానికే స్టీవ్ స్మిత్ (1), మ్యాక్స్ వెల్ (6) వెనుదిరిగారు. తొలి పవర్ ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి 21/3 తో7 కష్టాల్లో ఉన్న జట్టుకు 7వ ఓవర్ తొలి బంతికి మరో షాక్ తగిలింది.

స్టార్ ఆల్ రౌండర్ స్టాయినిస్ (0) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (11 నాటౌట్ ) ఒక్కడే నిలబడ్డాడు. 7 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్ 27/4. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ ఇప్పటికే రెండు వికెట్లు తీయగా, రషీద్, జోర్డాన్ చెరో వికెట్ పడగొడ్డారు.