శ్రీ‌వారికి వజ్రాలు,కెంపులు పొదిగిన వరద-కటి హస్తాలు విరాళం

శ్రీ‌వారికి వజ్రాలు,కెంపులు పొదిగిన వరద-కటి హస్తాలు విరాళం

తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సుమారు రూ.3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను ఒక దాత శుక్రవారం విరాళంగా అందించారు. వజ్రాలు మరియు కెంపులు పొదిగిన దాదాపు 5.3 కిలోల బరువు గల ఈ బంగారు వరద-కటి హస్తాలను శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈవో ఎవి. ధర్మారెడ్డికి దాత అందజేశారు.

కోరిన కోర్కెలు తీర్చే వెంకన్న స్వామికి భక్తులు ఇచ్చే కానుకలు అనేకానేకం. తమకు తోచిన విధంగా భక్తులు కానుకలు సమర్పిస్తుంటారు. ఇక కొంతమంది భక్తులైతే స్వామివారి కృపకు పాత్రులు అయ్యేందుకు ఇలా బంగారం, వజ్రాలతో కూడిన విలువైన ఆభరణాలను విరాళంగా ఇస్తుంటారు. ఇందులో భాగంగానే ఓ దాత శ్రీ‌వారికి విరాళంగా ఇచ్చిన వజ్రాలు, కెంపులు పొదిగిన బంగారు వరద-కటి హస్తాలు ఎంతో అందంగా ఉండి, మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.