గిరిజనుడికి మేయర్ పదవి..కేటీఆర్ ఓపెన్ ఆఫర్ కి కూనంనేని గ్రీన్ సిగ్నల్

గిరిజనుడికి మేయర్ పదవి..కేటీఆర్ ఓపెన్ ఆఫర్ కి కూనంనేని గ్రీన్ సిగ్నల్

-బీఆర్ఎస్ మద్దతుతో కొత్తగూడెం మేయర్ పదవి కైవసం
-సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు కీలక ప్రకటనగిరిజనుడికి మేయర్ పదవి..కేటీఆర్ ఓపెన్ ఆఫర్ కి కూనంనేని గ్రీన్ సిగ్నల్వరంగల్ టైమ్స్, కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 22, సీపీఐ పార్టీకి 22 స్థానాలు ఇలా రెండు పార్టీలకు సమానమైన స్థానాలు రాగా, బీఆర్ఎస్ 8, ఇతరులు 6 , బీజేపీ 1, సీపీఎం 1 స్థానాల్లో గెలుపొందడంతో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సింగరేణిలో కాంగ్రెస్, బీజేపీ అక్రమాలను ఎదుర్కునేందుకు, తమ మద్దతుతో సీపీఐ పార్టీకి మేయర్ పదవి కైవసం చేసుకునేలా మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయంపై కూనంనేనితో కేటీఆర్ ఫోన్ చేసి చర్చించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ప్రతిపాదనపై సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు సానుకూలంగా స్పందించారు.ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీతో కలిసి మేయర్ పదవి దక్కించుకుంటామని కూనంనేని ప్రకటించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన ప్రకటన చేశారు. మేయర్ పదవిని గిరిజనులకే ఇస్తామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్తో ఎలాంటి చర్చలు చేయలేదన్నారు. కొత్తగూడెంలో ప్రజలు సీపీఐని ఆదరించారన్నారు.