ఈ మైనపు విగ్రహం వెనుక ఆసలు కథ తెలుసా..?

బెంగళూర్‌: బతికి ఉండగానే భార్యకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న భర్తలున్న రోజులివి. అలాంటిది ఒక భర్త కుటుంబాన్ని విడిచి పరలోకాలకు వెళ్లిపోయిన భార్యకు ఏకంగా మైనపు విగ్రహం చేయించారు. ఈ మైనపు విగ్రహం వెనుక ఆసలు కథ తెలుసా..?ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. రాష్ట్రంలోని కొప్పల్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ గుప్తా తన భార్య విగ్రహం చేయించారు. ఈ విగ్రహం వెనుక కథేంటంటే…శ్రీనివాస్‌ గుప్తా భార్య కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇటీవల శ్రీనివాస్‌ గుప్తా గృహ ప్రవేశం చేశారు. ఈ వేడుకలో తన భార్య లేని లోటు తెలియకూడదని ఆమె మైనపు విగ్రహం చేయించి…ఇంట్లో ఉంచారు. గృహప్రవేశం వేడుకలో భార్య కూడా తన పక్కనే ఉందన్న భావనతో ఆయన ఎంతో సంతోషానికి లోనయ్యారు. ఆ విగ్రహంతో కుటుంబ సభ్యులు ఫొటోలు దిగి మురిసిపోయారు. ఆ దిగిన ఫొటో నుంచి ఒకటి పైన పోస్టు చేశాం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్య పై ఉన్న ప్రేమతో మైనపు బోమ్మ చేయించిన భర్త శ్రీనివాసు గుప్తాపై నేటీజన్లు పోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.