హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ వద్ద నిర్మించిన కుడివైపు ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్‌ను ఎస్ఆర్డీపీ ఫేజ్-1లోని ప్యాకేజీ-2లో భాగంగా రూ.26.45 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్స కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్యాకేజీ-2లో భాగంగా రూ. 448 కోట్ల వ్యయంతో చేపట్టిన 14 పనుల్లో ఇప్పటికే 6 పూర్తయ్యాయి. మిగిలిన పనులు సైతం వివిధ దశల్లో ఉన్నాయి. బైరామల్‌గూడ వంతెన నిర్మాణంలో ప్రత్యేక టెక్నాలజీ వాడారు. ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో బైరామల్‌గూడ జంక్షన్, సాగర్ రింగ్‌రోడ్ జంక్షన్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి.