పాత ఫోటోను షేర్ చేసిన మాజీ గవర్నర్

పాత ఫోటోను షేర్ చేసిన మాజీ గవర్నర్ఢిల్లీ: సీనియర్ రాజకీయ నాయకురాలు , సినీ నటి విజయశాంతి మళ్లీ బీజేపీలోకి వస్తుండటంతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 20 యేండ్ల క్రితం నాటి జ్ఞాపకాలను సోమవారం మీడియాతో పంచుకున్నారు. 1998లో విజయశాంతి బీజేపీలో చేరుతున్న సందర్భంగా ఢిల్లీలోని పార్టీ అగ్రనేత అద్వానీ నివాసంలో సమావేశమైనప్పటి ఫొటోను షేర్ చేశారు. 20 సంవత్సరాల తరువాత మళ్ళీ భారతీయ జనతా పార్టీకి సేవచేయడానికి విజయశాంతి రావడం హర్షణీయమని విద్యాసాగర్ రావు అన్నారు. ఇదిలా ఉంటే, విజయశాంతి బీజేపీలో చేరడం లాంఛనమే. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఆమె ఆ పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో పార్టీ పటిష్టతకు, 2023లో అధికారమే లక్ష్యంగా కృషి చేయాలని అమిత్ షా ఆమెకు సూచించారు.