అడిషనల్ డీజీపీకి తప్పిన ప్రమాదం

అడిషనల్ డీజీపీకి తప్పిన ప్రమాదంకృష్ణాజిల్లా: కంచికచర్ల అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలా కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. కంచికచర్ల పట్టణం శివారులో అడిషనల్ డిజిపి కారు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి రహదారి పక్కన కందకంలోకి దూసుకెళ్లింది. ఈఘటనలో ద్విచక్రవాహనదారునికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కంచికచర్ల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడు కర్రీ నరసింహరావును 108 లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలా సురక్షితంగా బయటపడ్డాడు. అడిషనల్ డీజీపీని ఆయన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వేరొక కారులో తరలించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.