కేసీఆర్, కేటీఆర్ లను టచ్ చేస్తే ఉరికించి కొడతం : ఎర్రబెల్లి

కేసీఆర్, కేటీఆర్ లను టచ్ చేస్తే ఉరికించి కొడతం : ఎర్రబెల్లిహైదరాబాద్ : బీజేపీ పై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను ఏ క్షణమైనా జైల్లో పెడతారని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్ ఇచ్చాడు.

తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, ఎల్ రమణ, దండే విఠల్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నేతలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ రేంజ్ లో వార్నింగ్ లు ఇచ్చారు.బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మానుకోవాలని దయాకర్ రావుహెచ్చరించారు.

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మీద చేయి వేస్తే తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారని వార్నింగ్ ఇచ్చారు. జైలుకు వెళ్లివచ్చిన వాళ్లు కేసీఆర్ విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఎరువుల ధరలు తగ్గించే వరకు కేంద్రంపై పోరాటం ఆగదని మంత్రి దయాకర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్ తోనే సాధ్యమన్నారు.