రైతు బంధు సంబురాలలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా

రైతు బంధు సంబురాలలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లాహనుమకొండ జిల్లా : సంక్రాంతికి నాలుగు రోజుల ముందే గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. రంగురంగుల ముగ్గులు, ఎడ్లబండ్ల ర్యాలీలతో పల్లెల్లో పండుగ సందడి కనబడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదవ విడుత 64 లక్షల మంది రైతులకు 50వేల కోట్ల పెట్టుబడి సాయం అందించింది. దీంతో సంక్రాంతి వరకు రైతు బంధు సంబురాలను కొనసాగించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఈనేపథ్యంలో రైతులు సంక్రాంతి ముందు నుంచే సంబురాల్లో మునిగి తేలుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, రైతులు, నియోజకవర్గ ప్రజలు రైతు బంధు వేడుకల్లో పాల్గొని పండుగ వాతావరణాన్ని కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే పరకాల నియోజకవర్గంలో నిర్వహించిన రైతు బంధు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎక్కడ చూసిన నేలపై పరిచిన రంగురంగుల ముగ్గులు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై ర్యాలీలతో రైతుల ముఖాల్లో చిరునవ్వులు, సీఎం కేసీఆర్ నిలువెత్తు చిత్రపటాలకు అభిషేకాలతో రైతు బంధు వేడుకలు ఘనంగా జరిగాయి.

రైతు బంధు సంబురాలలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లాపరకాల నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం నిర్వహించిన రైతు బంధు వేడుకల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పరకాల, దామెర మండల కేంద్రంలో రైతుబంధు సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఎడ్లబండ్లు, ట్రాక్టర్ ర్యాలీ లో ఎమ్మెల్యే చల్లా పాల్గొన్నారు. సంగెం మండల కేంద్రంలో రైతుబంధు సంబరాల్లో పాల్గొని ఎడ్ల బండ్లపై ర్యాలీ నిర్వహించారు.

రైతుబంధు సంబరాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన మండల స్థాయి ముగ్గుల పోటీలను ఎమ్మల్యే సందర్శించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతువేదిక భవనంలో ఏర్పాటు చేసిన రైతుబంధు సంబరాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రైతుబంధును ఉద్దేశించి మాట్లాడారు.

గత యేడేండ్లుగా ఎన్ని అవాంతరాలు వచ్చినా నిరంతరాయంగా కొనసాగిస్తున్న అద్భుతమైన పథకం రైతు బంధు అని ఎమ్మెల్యే చల్లా కొనియాడారు. రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. రైతుల పట్ల సీఎం కేసీఆర్ తీసుకుంటున్న శ్రద్ధ అనిర్వచనీయమైనదని కొనియాడారు.రైతు బంధు సంబురాలలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లారైతులు కూడా ప్రభుత్వానికి సహకరించి ప్రత్యామ్నాయ పంటలను చేపట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ధాన్యం కొనకుండా రైతులను భయాందోళనకు గురిచేస్తూ బీజేపీ ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి సభ్యులు, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, మార్కెట్ డైరెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, ఎమ్మార్వోలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.