వరంగల్ లో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు భారీ చోరీ సొత్తు స్వాధీనం

వరంగల్ అర్బన్ జిల్లా : తాళం వేసివున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను గురువారం సి.సి.ఎస్ మరియు ఖాజీపేట పోలీసులు సంయుక్తంగా కల్సి వలపన్ని పట్టుకున్నారు. నిందితుని నుంచి సుమారు రూ.30లక్షల విలువగల 475 గ్రాముల బంగారు, 3 కి.లోల వెండి ఆభరణాలు, రూ.2లక్షల 50వేల నగదు, 5 ఎల్.ఈ.డీ టివిలు, 4ల్యాప్ ట్యా న్లు , ఒక ప్రింటర్, 2 సెల్ ఫోన్లు, 6కెమెరాలు, ఒక ట్యాబ్, ఒక డిజిటల్ వాచ్ ఖరీదైన చలువ అద్దాలతో పాటు ఒక గ్యాస్ సిలెండర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ లో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు భారీ చోరీ సొత్తు స్వాధీనంనేడు వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సి.పి. డాక్టర్ విశ్వనాథ రవిందర్ నిందితున్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు సయ్యద్ అల్తాఫ్ ఏపీ ప్రకాషం జిల్లా చీరాల మండలం, నవాబుపేట గ్రామానికి చెందిన సయ్యద్ భక్షి కుమారుడు. ఆల్తాఫ్ ఆలియాస్ అఫ్రోజ్ బాల్యం నుంచే చిల్లర దొంగతనాలకు పాల్పడేవాడని తెలిపారు. అయితే తల్లిదండ్రులు ఆల్తాఫ్ ను మందలించడంతో ఇంటి నుంచి పారిపోయాడని సిపి వెల్లడించారు. తర్వాత నిందితుడు విజయవాడలో కారు డ్రైవింగ్ నేర్చుకుని కొద్ది రోజులు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఇదే సమయంలో ఆల్తాఫ్ కు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడన్నారు. తాను సంపాదించే డబ్బు జల్సాలకు సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు. రాత్రి, పగలు సమయాల్లో అవకాశాన్ని బట్టి ఇండ్లకు వేసిన తాళాలు పగులగొట్టి చోరీలు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. 2000 సంవత్సరం నుండి 2013 మధ్యకాలంలో ఆల్తాఫ్ ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరీ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డాడు. దొంగతనం కేసుల్లో పోలీసులు పలుమార్లు ఆల్తాఫ్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈస్ట్ గోదావరి జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చేసిన చోరీ కేసులో నిందితుడికి 4సంవత్సరాలు జైలు శిక్ష పడింది. జైలు జీవితం అనుభవించి తిరిగి 2017 డిసెంబర్ లో రాజమండ్రి జైలు నుంచి విడుదలై, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో కోద్ది రోజులు కార్పెంటర్ గా పనిచేశాడు. ఈ క్రమంలో మహబూబాబాదు చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. కొద్ది రోజులు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా వున్న ఆల్తాఫ్ 2018 నుంచి తిరిగి జల్సాలకు అలవాటు పడటంతో మరోమారు చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో భాగంగా నిందితుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పాల్వంచ ప్రాంతాల్లో తాళం వేసివున్న ఇండ్లల్లో చోరీలకు తెగపడ్డాడు. దొంగతనాలు చేసిన డబ్బుతో నిందితుడు కార్లను కోని, కొద్ది రోజులు వాడుకుని తిరిగి అమ్మేవాడని సిపి తెలిపారు.వరంగల్ లో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు భారీ చోరీ సొత్తు స్వాధీనం

నిందితుడు 2018 నుంచి ఇప్పటివరకు మొత్తం 28 చోరీలకు పాల్పడగా ఇందులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 20 చోరీలకు పాల్పడినట్లు సి.పి. రవిందర్ వెల్లడించారు. ఇందులో ఖాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 5,సుబేదారి 5, కేయూసి, మీ కాలనీ, పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చొప్పున మొత్తం 6చోరీలకు పాల్పడానట్లు తెలిపారు. ఇక శాయంపేట, దామెర, మడికొండ, మామునూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున మొత్తం 4చోరీలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7, ఖమ్మం జిల్లాలో ఒకచోరీ చేసినట్లు సి.పి. మీడియాకు తెలిపారు. అంతర్ రాష్ట్ర దొంగను అరెస్టు చేసి భారీ స్థాయిలో సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఓ.ఎస్డీ తిరుపతి, క్రైం ఎసిపి. బాబురావు, కాజీపేట్ ఎసిపి రవీందర్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాసరావు, కాజీపేట ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్ఐ దేవేందర్, అసిస్టెంట్ అనాలిటికల్ ఆఫీసర్ సల్మాన్‌ పాషా, సి.సి.ఎస్ ఎస్.ఐ బి.వి.ఎస్ రావు, ఎ.ఎస్.ఐ శ్రీనివాస రాజు, శివకుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రవి కుమార్, జంపయ్య, కానిస్టేబుళ్ళు మహమ్మద్ ఆలీ (మున్నా ), వేణుగోపాల్, వంశీ, నజీరుద్దీన్, నర్సింగరావులను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ అభినందించారు.