పేదలు పండుగ సంతోషంగా జరుపుకోవాలి

క్రిస్మస్​ గిఫ్ట్​ ప్యాక్​లు పంపిణీ చేసిన మంత్రి తలసానిపేదలు పండుగ సంతోషంగా జరుపుకోవాలిహైదరాబాద్​ : పేద, మధ్య తరగతి ప్రజలు సైతం పండుగలను సంతోషంగా జరుపుకోవాలనేదే సీఎం కేసీఆర్​ ఆలోచన అని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ సెయింట్ ఫిలోమినా చర్చిలో కార్పొరేటర్ కుర్మ హేమలత తో, సనత్ నగర్ డివిజన్ పరిధిలోని సీఎస్​ఐ చర్చిలో కార్పొరేటర్ కొలను లక్ష్మి తో కలిసి క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వం అందజేసిన గిఫ్ట్ ప్యాక్ లను మంత్రి పేదలకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రకాల పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని వివరించారు. క్రిస్మస్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ తలసాని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ ముకుందరెడ్డి, చర్చి ఫాదర్ చార్ల్స్, అధ్యక్షులు జయరాజ్, పద్మారావు నగర్ టీఆర్​ఎస్​ పార్టీ ఇన్​చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, సీఎస్​ఐ చర్చి ఫాస్టర్ రాబర్ట్, డీఎంసీ వంశీ, ఫాస్టర్ డానియల్, కృపానందం, దయాకర్, సుదీర్, మురళి, శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు.