వర్కింగ్ వుమెన్స్ కి ఫ్రీ మెడికల్ క్యాంప్

వర్కింగ్ వుమెన్స్ కి ఫ్రీ మెడికల్ క్యాంప్వరంగల్ అర్బన్ జిల్లా: ప్రతి వర్కింగ్ ఉమెన్ తమ ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండాలని, మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని వరంగల్ ఈస్ట్ జోన్ ఇంఛార్జ్ డిసిపి కె. వెంకటలక్ష్మి అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళా పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ సూచన మేరకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో వైద్య శిబిరాన్ని ఈస్ట్ జోన్ ఇంఛార్జ్ డి.సి.పి ప్రారంభించారు.

వర్కింగ్ వుమెన్స్ కి ఫ్రీ మెడికల్ క్యాంప్వరంగల్ అర్బన్ జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో 30 యేండ్లకు పైబడిన మహిళా పోలీస్ అధికారులకు వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆరోగ్య సమస్యలు వున్న సిబ్బంది వైద్యులు తీసుకోవాల్సిన చికిత్స , జాగ్రత్తలను తెలియజేసారు. రెండు రోజుల పాటు నిర్వహించే వైద్య శిబిరాన్ని మహిళా పోలీస్ అధికారులతో పాటు, హెంగార్డు వినియోగించుకోవాలని డి.సి.పి సూచించారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ ఇంఛార్జ్ డి.సి.పి పుష్పా, వరంగల్ అర్బన్ జిల్లా డీఎం అండ్ హెచ్ ఓ డా. లలితా, డిప్యూటీ వైద్యాధికారి ఉమశ్రీ, ఎ.ఆర్ అదనపు డి.సి.పి గిరిరాజు, ఎ.సి.పిలు శ్రీనివాస్, సదానందం, యూనిట్ డాక్టర్ డా. విజయ్ కుమార్, ఆర్.ఐలు భాస్కర్, నగేష్, హతీరాం, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల అశోక్ కుమార్ పాల్గొన్నారు.