స్పోర్ట్స్ డెస్క్ : గతంలో రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ గెలిచిన సానియా మీర్జా , ఆస్ట్రేలియన్ ఓపెన్ లో తన చివరి మ్యాచ్ ఆడేసింది. నేడు జరిగిన మిక్స్ డ్ డబుల్స్ లో సానియా జంట ఓటమిపాలైంది. క్వార్టర్స్ ఫైనల్లో సానియా, రాజీవ్ రామ్ జోడి.. 4-6, 6-7 స్కోర్ తో ఆస్ట్రేలియాకు చెందిన జేమీ ఫౌరిల్స్ – జేసన్ కుబ్లర్ జంట చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది.
వాస్తవానికి సానియా జంట రెండు సెట్లలోనూ గట్టి పోటీ ఇచ్చినా, ఆస్ట్రేలియన్ జంట ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఓటమితో ఇక సానియా ఆస్ట్రేలియన్ ఓపెన్ కు దూరమైనట్లే. ఈ యేడాది తన చివరి సీజన్ ఆడుతున్నట్లు ఇటీవల సానియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు ఆమె పేర్కొన్నారు.