రేవ్ పార్టీలో ఎన్సీబీకి చిక్కిన షారుక్ ఖాన్ సన్

రేవ్ పార్టీలో ఎన్సీబీకి చిక్కిన షారుక్ ఖాన్ సన్

వరంగల్ టైమ్స్, ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. ముంబై తీరంలోని క్రూజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అతన్ని ప్రశ్నిస్తోంది. శనివారం రాత్రి ఈ క్రూజ్ షిప్ లో జరుగుతున్న రేవ్ పార్టీపై అధికారులు దాడి చేశారు. అయితే షారుక్ తనయుడు ఆర్యన్ పై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. అతన్ని అరెస్ట్ కూడా చేయలేదని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె వెల్లడించారు. ఈ క్రూజ్ పార్టీ ప్లాన్ చేసిన ఆరుగురు ఆర్గనైజర్లకు కూడా ఎన్సీబీ సమన్లు జారీ చేసింది.రేవ్ పార్టీలో ఎన్సీబీకి చిక్కిన షారుక్ ఖాన్ సన్ఈ రేవ్ పార్టీలో ఎఫ్ టీవీ ఇండియా ఎండీ కాషిఫ్ ఖాన్ హస్తం కూడా ఉండటంతో ఆయనను కూడా ఎన్సీబీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఆర్యన్ ఖాన్ ఫోన్ ను ఎన్సీబీ సీజ్ చేసింది. అతను డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అతని దగ్గర ఏవైనా డ్రగ్స్ ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. రేవ్ పార్టీ తర్వాత సీజ్ చేసిన ఫోన్లకు వచ్చిన మెసేజ్ లను పరిశీలిస్తున్నారు. ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ పెద్ద కొడుకు. ఆర్యన్ తో పాటు ఈ రేవ్ పార్టీలో ప్రముఖ వ్యాపారవేత్తల కూతుళ్లు కూడా ఉన్నట్లు ఎన్సీబీ గుర్తించింది.