తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

వరంగల్ టైమ్స్, తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 47,781 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అధ్యయనోత్సవాల సందర్భంగా పౌర్ణమి గరుడ సేవను అధికారులు రద్దు చేశారు. 4 కేంద్రాల వద్ద వైకుంఠ ద్వారం దర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి, గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లను జారీ చేస్తున్నారు. 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి లభించనుంది.