సంజీవయ్య శత జయంతిని ఘనంగా జరపాలి

సంజీవయ్య శత జయంతిని ఘనంగా జరపాలిహైదరాబాద్ : ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ సీఎం, దళిత నాయకులు దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని దామోదరం సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు అన్నారు. మంగళవారం నాడు హైదరాబాద్ లో ఆయన నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, ప్రముఖ సంపాదకులు రామచంద్రమూర్తి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ దీపక్ జాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 14న నిర్వహించనున్న దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని వి. హనుమంతరావు కోరారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన జయంతి వేడుకల సందర్భంగా సెమినార్ నిర్వహించాలని ఆ కార్యక్రమంలో ఏఐసీసీ జాతీయ నాయకులు, ఆయన సమకాలీకులు పాల్గొనేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా ప్రముఖ సంపాదకులు రామచంద్రమూర్తి దామోదరం సంజీవయ్య జీవిత చరిత్ర గురించి ఒక పుస్తకాన్ని రాయాలని నిర్ణయించారు.